రొమాంటిక్ రెండ్రోజుల ముందే
ఒక రోజు ముందు మీడియాకీ, సెలబ్రెటీలకూ ప్రీమియర్ షో వేయడం మామూలే. పాజిటీవ్ టాక్ వస్తే – కలక్షన్లు వస్తాయి. ఏమాత్రం తేడా వచ్చినా – ఫట్‌మనడం ఖాయం. ఏమాత్రం తేడా వచ్చినా ఫట్ మనడం ఖాయం.అయితే పూరి మాత్రం రెండ్రోజుల ముందే – ప్రీమియర్స్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. పూరి జగన్నాథ్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం రొమాంటిక్
.
ఈ చిత్రానికి పూరి కథ, మాటలు, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. ఈనెల 29న విడుదల అవుతోంది. అయితే రెండ్రోజుల ముందే అంటే ఈనెల 27న రొమాంటిక్ స్పెషల్ ప్రీమియర్స్‌పడబోతున్నాయి. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో బుధవారం రాత్రి 8 గంటలకు రొమాంటిక్ స్పెషల్ స్క్రీనింగ్ జరగబోతోంది. టాలీవుడ్ లోని సెలబ్రెటీలంతా ఈ షోకి హాజరు కాబోతున్నారు. మీడియాకు మరో షో ఉంది. రెండు రోజుల ముందే ప్రీమియర్స్ అంటే గట్స్ ఉండాలి. పూరికి అది ఎక్కువే. అందుకే రెండ్రోజుల ముందే చూపించేస్తుండు.