ఆ విషయంలో వరుడు.. వీక్ !
ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న రెండు సినిమాలు (వరుడు కావలెను, రొమాంటిక్) చిత్రాలపై పాజిటివ్ టాక్ నడుస్తుంది. అయితే ఈ రెండు చిత్రాల్లో రొమాంటిక్ ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. టీజర్ ని ప్రభాస్ రిలీజ్ చేశారు. వరంగల్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక తనయుడు సినిమాపై పూరి చాలా నమ్మకంగా ఉన్నాడు. రొమాంటిక్ అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయిలా ఉందని స్వయంగా పూరినే కితాబిచ్చారు. ఫైనల్ అవుట్ పుట్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట. బ్లాక్ బస్టర్ హిట్ గ్యారెంటీ అని ఫిక్సైపోయారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే రెండ్రోజుల ముందే ప్రీమియర్ షోస్ వేసేందుకు రెడీ అవుతున్నాయి.
అయితే పోటీలో ఉన్న మరో సినిమా వరుడు కావలెను మాత్రం ప్రమోషన్స్ లో చాలా వీక్ గా కనిపిస్తున్నాడు. మరో 24 గంటల్లో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వుంది. కానీ దీని డిటైయల్స్ తెలియవు. ఎవరు చీఫ్ గెస్ట్ అన్నది తెలియదు. బ్యానర్ కు ఎంత పేరు వున్నా, కొత్త దర్శకురాలు, మిడ్ రేంజ్ హీరో అయినపుడు పబ్లిసిటీ భయంకరంగా జరగాల్సి వుంది. అసలే రొమాన్స్ లో నాగశౌర్య చాలా వీక్. ఈ విషయాన్ని స్టార్ హీరోయిన్ సమంత కూడా ఓ సందర్భంలో చెప్పింది. ఆ వీక్నెస్ ని ఇప్పుడు రొమాంటిక్ జంట ఆకాష్ పూరి-కేతిక శర్మ క్యాష్ చేసుకొనేలా ఉన్నారు.