టీమిండియా ఓడిపోయింది.. నాగబాబుని తగులుకున్నారు !

నాగబాబు దుబాయ్ లో జరిగిన టీ-20 క్రికెట్ మ్యాచ్ కి పోయి ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. తీరా ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంతో నెటిజన్లు బాబుని ఓ రేంజ్ లో తగులుకున్నారు.

జనసేనలో ఎంట్రీ ఇచ్చారు. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మా ఎన్నికల్లో వేలు పెట్టారు, ప్రకాష్ రాజ్ ఓడిపోయారు.. ఇప్పుడు దుబాయ్ వెళ్లారు, ఇండియాని ఘోరంగా ఓడించి ఇంటికొచ్చారు. అబ్బెబ్బే వద్దమ్మా.. మీరు ఇండియా మ్యాచ్ లకు వెళ్లొద్దమ్మా అంటూ నాగబాబుపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి.