రేణుకు కాబోయే భర్త గురించి షాకింగ్ నిజాలు !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. ఐతే, ఇప్పటి వరకు రేణుకు కాబోయే భర్తకు సంబంధించిన పోటో, వివరాలు బయటికిరాలేదు. దీంతో రేణుకు అతడు ఎలా పరిచయం అయ్యాడు ? ఏలా ఉంటాడు ?? పేరు-ఊరు ఏంటీ.. ??? ఏం చేస్తుంటాడు.. ???? అనే విషయాలు ఎవరికీ తెలియదు. ఇప్పుడీ వివరాలని టీఎస్ మిర్చి సేకరించింది.
తనకు కాబోయే భర్త ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడని మాత్రమే రేణు తెలిపింది. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన పిక్ లోనూ.. అతడి మొహం కనిపించకుండా క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐతే, రేణుకు కాబోయే వాడు సెకండ్ హ్యాండే అని తెలిసింది. ఆయనకు ఇదివరకే పెళ్లయ్యింది. ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు ఏంజెలికా. పవన్ – రేణుల కూతురు ఆద్యకు మంచి ఫ్రెండు. వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలని రేణు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
భార్యకు దూరమై తోడు కోసం చూస్తున్న అతడికి రేణు పరిచయమైంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమని పెళ్లి పీఠలు ఎక్కిస్తున్నారు. ఐతే, సహజీవనం చేయడం ఇష్టం లేకే రెండో పెళ్లి చేసుకొనేందుకు రెడీ అయ్యింది. గతంలో పవన్ తో సహజీవనం చేసి.. ఆ తర్వాత పెళ్లి చేసుకొంది. మరోసారి అలాంటి తప్పు చేయొద్దని పెళ్లి చేసుకొంటున్నట్టు రేణు తెలిపిన సంగతి తెలిసిందే. .