బెయిల్ వచ్చినా ఆర్యన్ ఖాన్ ఇంకా జైల్ లోనే.. ఎందుకంటే ?
క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌కు గురువారం బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మూన్‌మూన్ ధమేచాలకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 21 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. శుక్రవారమే ఆర్యన్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. కానీ అతడు ఇంకా జైలులోనే ఊచలు లెక్కిస్తున్నాడు.
గురువారం సాయంత్రం బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తీర్పు వచ్చింది. షరతులతో కూడిన దాని పూర్తి కాపీ ఈరోజు రిలీజ్ అయింది. ఆర్డర్ కాపీ ప్రకారం అన్ని పనులు చేసినప్పటికీ ఆర్యన్ ఈరోజు విడుదల కాలేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల తర్వాత బెయిల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వరు. మళ్లీ మరుసటి రోజు ఉదయం ప్రాసెస్ చేయాల్సిందే. అలా శుక్రవారం రాత్రి కూడా ఆర్థర్ రోడ్ జైలులో ఆర్యన్ ఉన్నాడు. ఈరోజు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి బయటకు రాబోతున్నాడు షారూక్ కొడుకు ఆర్యన్.