కేసీఆర్ ప్రెస్ మీట్ 2 : బండిపై ఎటాక్
లంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మీడియా ముందుకొచ్చారు. ఎప్పుడూ లేనిది తొలిసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని నేరుగా ఎటాక్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు, పెట్రో ధరలు తదితర అంశాలపై బీజేపీ చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ఇకపై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. నేనే దిగుతా. ఇకపై నీ భరతం పడతానని బండి సంజయ్ కి వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సోమవారం మీడియా ముందుకొచ్చిన బండి సంజన్ కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ అబద్దాలు చెబుతున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పలేదు. కేవలం ఉప్పుడు బియ్యాని మాత్రమే కొనమని చెప్పిందన్నారు. సుదీర్ఘంగా మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే బండి ప్రెస్ మీట్ ముగిసిన కొన్ని గంటల్లోనే సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చారు. వడ్లు కేంద్రం కొంటుందా? కొనదా? సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గట్టిగా ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్రవేస్తున్నారని అన్నారు. ఏడాదిగా ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమంలో 600 మంది రైతులు మరణించారు. దీనిపై కేంద్రం మసిపూసి మారేడు కాయ చేద్దామని చూస్తోంది. ఏదైనా ప్రశ్నిస్తే దేశద్రోహి అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు, బిల్లులకు మద్దతిచ్చినప్పుడు దేశద్రోహి కాని కేసీఆర్.. ఇప్పుడు దేశద్రోహి అయ్యాడు. ఎవరు మాట్లాడితే వారు దేశద్రోహులా..? భాజపానే నియమించిన గవర్నర్ సత్యపాల్ మాలిక్, ఆ పార్టీకి చెందిన వరుణ్ గాంధీ కూడా రైతు చట్టాల గురించి ప్రశ్నించారు. వారంతా దేశద్రోహులా..? కేసీఆర్ చైనాలో డబ్బులు దాచుకున్నారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.