అందుకే దళితుడిని సీఎం చేయలే : కేసీఆర్
‘దళితుడిని సీఎం చేస్తానని మాటిచ్చిన సీఎం కేసీఆర్ మాటతప్పిండు’, ‘ఉద్యమకారులని కేసీఆర్ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు’, ‘ప్రస్తుతం ఉద్యమద్రోహులు రాజ్యమేలుతున్నరు’. ఈ మూడు ప్రధాన ఆరోపణలపై తాజా ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ స్పందించారు. పూర్తి వివరణ ఇచ్చారు. దళితుడిని చేయాలేనన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిపై విమర్శలు చేయడం ఎందుకు ? ఎందుకు చేయలేదు అన్నదానికి చాలా కారణాలు ఉన్నయి. సమర్థవంతుడైన నాయకుడు కావలని, అందరితో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నం. అప్పట్లో దళితుడిని సీఎం చేస్తామంటే షబ్బీర్ అలీ వద్దన్నారని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయినా.. దళితుడిని సీఎం చేస్తానని ఇచ్చిన మాట తప్పినా.. ప్రజలు రెండోసారి ఆశీర్వదించారు. మళ్లీ అధికారంలోకి వచ్చామన్నారు.
ఉద్యమకారులకు ద్రోహం చేస్తున్నామనే ఆరోపణలపై కూడా కేసీఆర్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉద్యమకారులే ఉండాలంటే ఎట్ల నడుస్తుదని. ప్రతిభావంతుడు అని భావిస్తే.. ఇతర పార్టీలోని సీనియర్లని తీసుకుంటాం. వారికి మంచి పదవులు ఇస్తాం. వారి సేవలని వినియోగించుకుంటాం. అందులో తప్పేముంది ? ఉద్యమకారుల్లో కొందరికి అవకాశాలు వస్తయన్నారు. మొత్తానికి.. సీఎం కేసీఆర్ పై ఎప్పటి నుంచో తనపై ఉన్న ఆరోపణలకు వివరణ ఇచ్చిండు. దీన్ని బట్టీ చూస్తే.. తెలంగాణ బీజేపీ, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో కేసీఆర్ అప్రమత్తం అయినట్టు కనిపిస్తున్నది. ఇకపై ఏమాత్రం అలస్యం చేసిన.. డ్యామేజ్ తప్పదనే కేసీఆర్ ఎటాక్ ని మొదలెట్టినట్టు అనిపిస్తున్నది.