ఈమె అనసూయ అంటే అస్సలు నమ్మరు

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలో పాత్రల ఫస్ట్ లుక్ లతోనే దర్శకుడు షాక్ ఇస్తున్నాడు. బన్నీని నెవ‌ర్ బిఫోర్ అవ‌తారంలో చూపించాడు. ఫ‌హ‌ద్ ఫాజిల్ కి గుండు కొట్టించాడు. సునీల్ అయితే… గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మార్చేశాడు. ఇప్పుడు అన‌సూయ వంతు వ‌చ్చింది. పుష్ష‌లో అన‌సూయ ఓ కీల‌కమైన పాత్ర‌ని పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాక్షాయ‌ని గా త‌ను క‌నిపించ‌నుంది. తాజాగా దాక్షాయని ఫస్ట్ లుక్ ని చిత్రబృందం విడుదల చేసింది.

బేబీక ట్‌, పెద్ద బొట్టు, మెడ‌లో న‌గ‌లు, ప‌ట్టు చీర‌, చేతిలో ప‌ట్ట‌క‌ర్ర‌, నోట్లో జ‌ర్దాతో… న‌యా అవ‌తారంలో చూపించాడు. ఈ సినిమాలో అన‌సూయ మ‌రో విల‌నా? అనే అనుమానం వ‌చ్చేలా ఈ గెట‌ప్ ఉంది. అసలు ఆమె అనసూయ అంటే గుర్తు పట్టలేనంత షాకింగ్ గా లుక్ ని డిజైన్ చేశారు. ఇక ఈ సినిమాలో బన్నీకి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రెండు పార్టులుగా పుష్ప రాబోతుంది. పార్టు 1 వన్ డిసెంబర్ 17న రిలీజ్ కానుంది. 

She is arrogant and pride personified!

Introducing @anusuyakhasba as #Dakshayani #PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @ThisIsDSP @adityamusic @PushpaMovie #Anasuya #AnasuyaBharadwaj #Pushpa pic.twitter.com/Re07Ic1Y9r— OTTRelease (@ott_release) November 10, 2021