బాల‌య్య‌పై భ‌యంతో కూడిన గౌర‌వంతో.. మైత్రీలో వచ్చిన మార్పులు !

బాలయ్యతో సినిమా చేసే నిర్మాత, నిర్మాణ సంస్థకు ఏ టెన్షన్ ఉండదు. ఒక్కసారి కథ ఓకే అన్నాక.. బాలయ్య ఏవీ పట్టించుకోరు. చెప్పిన డేటుకు, టైమ్ కి వస్తాడు. దర్శకుడు చెప్పింది చేస్తాడు. కానీ టెన్షన్ అంతా చిత్ర యూనిట్ కే. బాలయ్య ఎప్పుడు ఎలా ఉంటారో తెలియక.. యూనిట్ సభ్యులకు చివాట్లు, అప్పుడప్పుడు దెబ్బలు కూడా పడతాయని టాక్. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీస్ యూనిట్ భయపడుతుందని తెలుస్తోంది.  బాల‌కృష్ణ తో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కోసం బాల‌య్య‌కు భారీ పారితోషికం ఇచ్చింది మైత్రీ. బాల‌య్య‌తో సినిమా అంటే నిర్మాత‌లేం టెన్ష‌న్ ప‌డ‌డం లేదు గానీ, యూనిట్ మాత్రం కాస్త కంగారు పడుతుందని టాక్‌. 

రెగ్యుల‌ర్ గా మైత్రీకి ప‌నిచేసే మేనేజ‌ర్లు, ప్రొడక్ష‌న్ డిపార్ట్ మెంట్‌.. వీళ్లంతా.. ఇప్పుడు మెల్ల‌మెల్ల‌గా త‌ప్పుకుంటున్నార‌ని తెలుస్తోంది. బాల‌య్య‌కు ప‌రిచ‌యం ఉండి, బాల‌య్య సినిమాల‌కు ప‌నిచేసిన‌ అనుభ‌వం ఉన్న‌.. యూనిట్ తో కొత్త‌గా ఓ టీమ్ ఏర్పాటు చేయిస్తోంద‌ట మైత్రీ. దాదాపుగా మైత్రీకి ప‌నిచేసేవాళ్లంతా.. ఈ సినిమా కోసం పక్క‌కు త‌ప్పుకుని, కొత్త టీమ్ వ‌చ్చి చేరింద‌ని.. ఇదంతా బాల‌య్య‌పై భ‌యంతో కూడిన గౌర‌వం వ‌ల్ల వ‌చ్చిన మార్ప‌ని ఇండ్ర‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు.