తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

హైదరాబాద్ నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్. టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై  ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటల నుంచే ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు ఉదయం 6 గంటల నుంచే అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్ సేవలు తెల్లవారుజాము 4 గంటల నుంచే అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటుగా MGBS, JBS లలో కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ బస్సులను అందుబాటులో ఉండనున్నాయి.