ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణం

హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీక‌ర్ ఛాంబర్ లో..  ఆయ‌న‌తో స‌భాప‌తి పోచారం శ్రీనివాస రెడ్డి ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డిల‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.అంతకుముందు ఈటల గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలుగా రాజాసింగ్, రఘునందన్ రావు ఉండగా.. వీరికి ఈటల రాజేందర్ తోడయ్యారు. ఇకపై తెలంగాణ శాసనసభలో బీజేపీ ‘ఆర్ ఆర్ ఆర్’ ఎమ్మెల్యేలు దుమ్ములేపుతారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. 

సీఎం కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతా అనుభవం ఉన్న ఈటల రాజేందర్ ని పొమ్మనక పొగబెట్టిన సంగతి తెలిసిందే. ఆయన భూ అక్రమ ఆరోపణలు చేసి.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈటల టీఆర్ ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరి.. హుజురాబాద్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ ని ఢీకొని గెలుపొందారు. మళ్లీ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ‘కేసీఆర్ వర్సెస్ ఈటల’ ఫైట్ చూడ్డానికి తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.