కోహ్లి పూర్తిగా వదిలేస్తాడు

టీమిండియా టీ20 కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా కోహ్లీ తప్పుకుంటాడనే ప్రచారం జరుగుతుంది. దీనిపై భారత క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ రవిశాస్త్రి స్పందించారు. మానసికంగా అలసిపోయానని అనిపించినప్పుడు.. బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని కోరుకున్నప్పుడు విరాట్‌ కోహ్లి కెప్టెన్సీని పూర్తిగా వదిలిపెట్టేందుకు ఆస్కారముందని శాస్త్రి అన్నాడు.టెస్టు క్రికెట్లో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని భారత్‌ జట్టు గత అయిదేళ్లుగా నంబర్‌వన్‌గా ఉంది.

తాను మానసికంగా అలసిపోయానని అనిపించినప్పుడు లేదా బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని భావించినప్పుడు సమీప భవిష్యత్‌లో కోహ్లి కెప్టెన్సీని పూర్తిగా విడిచిపెట్టే అవకాశాలను కొట్టి పారేయలేం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇదే జరిగింది. టెస్టు కెప్టెన్సీపై దృష్టి సారించడం కోసం అతడు టీ20 సారథ్యాన్ని వదులుకున్నాడు. త్వరలో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు పూర్తిగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చేమో. కోహ్లి మాత్రమే కాదు ఎంతో విజయవంతమైన క్రికెటర్లు.. బ్యాటింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు సారథ్యాన్ని వదిలేశారని గుర్తు చేశారు.