ప్రభాస్-దీపికా.. రొమాన్స్ షురు !

నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో రాబోతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని సైన్స్-ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిది. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ను అమితాబ్ బచ్చన్ తో పూర్తిచేశారు. సినిమాలో ఆయనది ఓ చిన్న ప్రత్యేక పాత్ర. కాబట్టి ముందుగా ఆయనతో కొన్ని సన్నివేశాల్ని పూర్తిచేశారు. ఆ తర్వాత మళ్లీ మరో షెడ్యూల్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. ఇన్నాళ్లకు ఆ టైమ్ రానే వచ్చింది. డిసెంబర్ 2 నుంచి ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.

ఇంకో విశేషం ఏంటంటే, ప్రభాస్ సెట్స్ పైకొచ్చిన వారం రోజులకే దీపిక పదుకోన్ కూడా ఈ సినిమా షూట్ లో జాయిన్ కాబోతోంది. రాగానే ప్రభాస్ తో రొమాన్స్ షురు చేయబోతుందట. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ని ముందుగా చిత్రీకరించనున్నారని సమాచారమ్. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తోంది ‘ప్రాజెక్ట్ K’. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ‘ప్రాజెక్ట్ K’కు టైమ్ కేటాయించలేకపోయాడు. ఇప్పుడు ఆ రెండు సినిమాలు పూర్తవ్వడంతో ఈ సినిమా మరోసారి సెట్స్ పైకి రాబోతోంది.