మహేష్ నుంచి ఎడ్యుకేషన్ యాప్

సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మేన్ కూడా. ఆయనకు చాలానే సైడ్ బిజినెస్ లు ఉన్నాయి. మహేష్ కు ఆల్రెడీ ఓ బ్యానర్ ఉంది. జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తుంటాడు. దీంతో పాటు ది ‘హంబుల్’ అనే డిజైనర్ వేర్ బిజినెస్ కూడా ఉంది. ఇక ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబీ పేరిట ఆయన మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ మరో కొత్త వ్యాపారంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

లాక్ డౌన్ తో ఆన్ లైన్ చదువులకు డిమాండ్ పెరిగింది. ఎన్నో ఎడ్యుకేషనల్ యాప్స్ పుట్టుకొచ్చాయి. వీటిలో ‘బైజూస్’ లాంటి ఒకట్రెండు లెర్నింగ్ యాప్స్ బాగా క్లిక్ అయ్యాయి. ఈ బైజూస్ కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు ఇలాంటిదే మరో లెర్నింగ్ యాప్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు. సీనియర్ కేజీ విద్యార్థుల నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు అందరికీ పనికొచ్చేలా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో పనిచేసే ఓ ఎడ్యుకేషన్ యాప్ ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు.