విజ‌య‌వాడ‌కు సీఎం కేసీఆర్..! అందుకేనంటున్న రేవంత్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం విజయవాడకు వెళుతున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా ఆయన అమ్మవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుతూ కేసీఆర్ పలు మొక్కులు మొక్కుకున్న సంగతి తెలిసిందే. తిరుమల వేంకటేశ్వరుడికి బంగారు సాలిగ్రామ హారం, పేటల కంటె, తిరుచానూరు అమ్మవారికి బంగారు ముక్కుపుడక, వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు పూతగల కిరీటం, విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక, కురివి వీరభద్రస్వామికి బంగారు మీసాలు చెల్లిస్తానని ఆయన మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడు విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

అయితే కేసీఆర్ విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌పై కాంగ్రెస్ నేత రేవంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఆయ‌న స్పందించారు. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్ని వారసుల కోసం తండ్రులు పడుతున్న ఆరాటమేన‌న్నారు. కవిత కోసం కేసీఆర్ తాపత్రయం .. కొడుకుల కోసం డిఎస్ ఆరాటం అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే కేసీఆర్ కు విజయవాడ లో గుట్టమీద అమ్మవారు .. గుట్టకింద కమ్మ వారు గుర్తుకొచ్చారని విమ‌ర్శించారు.