’83’ ట్రైలర్ టాక్

ప్రేక్షకులు, క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ’83’. భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ కనిపించనున్నారు. ఆయన సతీమణి రోమీ భటియా పాత్రలో దీపిక పదుకొనె నటిస్తున్నారు. కబీర్‌ ఖాన్‌ దర్శకుడు. 1983 ప్రపంచ కప్‌ పోటీలో భారత్‌ విజేతగా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డిసెంబర్ 24న ’83’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా 83 ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో సరదా సన్నివేశాలు కనిపించినా.. ఎమోషనల్ గా సాగింది. ప్రతి సీన్ రొమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. ఇంతే గ్రిప్పింగ్ గా సినిమా మొత్తం సాగితే.. ’83’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం గ్యారెంటీ. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. దేశభక్తిని రగిలించేలా ట్రైలర్ ని షార్ప్ గా కట్ చేశారు.