‘అఖండ’ విజయం..

బోయపాటి శ్రీను దర్శకత్వంలో సుమారు 70 కోట్ల భారీ బడ్జెట్ తో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అఖండ’. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.  ఇక నందమూరి అభిమానులు, మాస్ ఆడియన్స్ ఈ సినిమాకి విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే సినిమాలో బోయపాటి.. బాలయ్యను రెండు పాత్రల్లో చాలా పవర్ ఫుల్ గా చూపించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అగోర పాత్రలో బాలయ్య తన విశ్వరూపం చూపించాడు.  


 దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ ని మెయిన్ విలన్ గా మార్చేశాడు. గతంలో బాలయ్య నటించిన లెజెండ్ సినిమాతో జగపతి బాబు ని ఒక్కసారిగా విలన్ గా మార్చాడు బోయపాటి. ఆ సినిమాలో జగపతి బాబు విలనిజం అద్భుతంగా పండింది. అక్కడితో జగపతిబాబు కాస్త అన్ని ఇండస్ట్రీలో విలన్ గా బిజీ అయిపోయాడు. అయితే ఇప్పుడు శ్రీకాంత్ ను కూడా అదే రేంజ్ లో ఎలివేట్ చేయడానికి అఖండ సినిమాలో విలన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. సినిమాలో శ్రీకాంత్ వరదరాజులు అనే పాత్రను పోషించాడు. మరి శ్రీకాంత్ ఈ పాత్రకు ఎంత వరకు న్యాయం చేశాడనేది అభిమానులు తెలియజెయాల్సి ఉంది.