శేఖర్’కు ఫ్యాన్సీ ఆఫర్లు

రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా శేఖర్. జీవిత రాజశేఖర్ డైరక్టర్. స్క్రీన్ ప్లే విభాగం కూడా ఆమెనే చూసుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  ఈ సినిమాపై దాదాపు అన్ని ఓటీటీలు కన్నేశాయి. ఇందులో భాగంగా ఫ్యాన్సీ రేట్లు కూడా ఆఫర్ చేశాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. శేఖర్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం రూ. 22 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది. 

ఇది ఆల్రెడీ హిట్టయిన మలయాళ మూవీ జోసెఫ్ కు రీమేక్. ఈ జానర్ సినిమాలు ఓటీటీలో బాగా నడుస్తాయి. అందుకే శేఖర్ కోసం ఓటీటీలు క్యూ కడుతున్నాయి.   ఇది రీమేక్ మూవీ అయినప్పటికీ కథ-స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేశారు. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కోసం సినిమాలో ఓ సర్ ప్రైజ్ కూడా ప్లాన్ చేశారంట. సినిమా చూసి మాత్రమే ఆ సర్ ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలంటున్నారు. శేఖర్ గ్లింప్స్ రిలీజైన తర్వాత ఈ ఆఫర్లు ఇంకాస్త ఎక్కువయ్యాయంటున్నారు.