ఇల్లీ.. బికినీ ఫెస్టివ‌ల్

గోవా బ్యూటీ ఇలియానా బికినీ ఫెస్టిఫెల్ లో బిజీగా గడుపుతోంది. ఇది ఎక్కడ జరుగుతుంది ? అనే ప్రశ్న వేయకండీ. ఇల్లీ ఎక్కడ ఉంటే.. అక్కడే బికినీ ఫెస్టివెల్ జరుగుతొంది. బికినీ తప్ప మరోటి ధరించకూడదని ఇటీవలే ఇల్లీ ఓట్టు పెట్టుకున్నట్టుంది.

ప్రస్తుతం మాల్దీవుల్లో విహ‌రిస్తున్న ఈ గోవా భామ గ‌త కొన్ని రోజులుగా వ‌ర‌స పెట్టి బికినీ పోజుల‌ను పోస్టు చూస్తూ ఉంది. రంగు రంగు బికినీలు, డిఫ‌రెంట్ స్టైల్ బికినీల్లో ఫొటోలు దిగుతూ, సెల్ఫీలు పోస్టు చేస్తూ త‌న అభిమానుల‌కు ఉత్సాహాన్ని ఇస్తోంది.

ప్రస్తుతం.. ఈముద్దుగుమ్మ చేతిలో సినిమాలేవీ లేవు. దీంతో విహారాల‌తోనే బిజీగా గడుపుతుంది. ఎక్కడ ఉన్న టాపిక్ ఆఫ్ ది డేగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. బికినీ అందాలను వివిధ భంగిమల్లో చూపిస్తోంది.

ఇది వ‌రకూ ఒక దేశానికి ఇలియానా ట్రావెల్ అంబాసిడ‌ర్ గా కూడా ప‌ని చేసింది. అక్క‌డ ర‌క‌ర‌కాల లొకేష‌న్ల‌లో ఫొటోలు దిగి పోస్టు చేస్తూ.. అక్క‌డి టూరిజాన్ని ప్ర‌మోట్ చేసింది. ఇప్పుడు కేరాఫ్ మాల్దీవులుగా విహ‌రిస్తోంది. అక్కడి అందాలను తన అందాలతో కలిపి ప్రమోట్ చేస్తోంది.