ఆర్ఆర్ఆర్ కు చంద్రబాబు ప్రమాదం ?

ఏపీ అసెంబ్లీలో భువనేశ్వరిపై వ్యాఖ్యలు, చంద్రబాబు ఏడుపు, నందమూరి ఫ్యామిలీ రియాక్షన్.. ఇవన్నీ ఒక సీక్వెన్స్ లో జరిగిపోయాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ రెస్పాన్స్ సరిగా లేదని టీడీపీ బ్యాచ్ హంగామా చేసింది. ఇంకా చేస్తోంది కూడా. అయితే ఇది ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ వరకు కొనసాగితే.. భువనేశ్వరి ఏపీసోడ్ ఆర్ ఆర్ ఆర్ పై ఎఫెక్ట్ చూపించడం ఖాయం అంటున్నారు.

యాంటీ బ్యాచ్ ఆర్ ఆర్ ఆర్ పై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తుంది. కరోనా దెబ్బ, ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంతో ఆల్రెడీ ప్రీ-రిలీజ్ బిజినెస్ ను కొంతమేర తగ్గించుకున్నారు. ఇలాంటి టైమ్ లో చంద్రబాబు మనుషులు ఆర్ఆర్ఆర్ రిలీజ్ టైమ్ లో ఎన్టీఆర్ పై మరోసారి దృష్టిపెడితే భారీ డ్యామేజ్ తప్పదేమో.. !

ఇక్కడ బాబు అండ్ కో టార్గెట్ ఎన్ టీఆర్ ఒక్కడే కాదు. రామ్ చరణ్ కూడా. కొన్నాళ్లుగా చిరంజీవితో పాటు ఇతర మెగా సభ్యులు జగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. పలు సందర్భాల్లో చిరంజీవి, జగన్ ను పొగిడిన సందర్భాలూ ఉన్నాయి. వీటన్నింటినీ ఓ కంట కనిబెడుతున్న చంద్రబాబు.. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అది ఆర్ ఆర్ ఆర్ రూపంలో వచ్చినట్టే కనిపిస్తుంది.