మిల్కీ.. మూడు ఫిట్ !

మిల్కీ బ్యూటీ తమన్నా మాంఛి.. గ్లామర్ ఫిగర్. గ్లామర్ హీరోయిన్ గా నీరాజనాలు అందుకుంది. ఐటమ్ సాంగ్స్ లో మెరిసింది. కానీ ఎప్పుడూ అతి చేయలేదు. నటననే నమ్ముకుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ, గ్లామర్ పాత్రల్లోనూ మెప్పించింది. ఇప్పటికీ మెప్పిస్తోంది.

అయితే ప్రస్తుతం ఉన్న పోటీలో తమన్నా ఇంకాస్త గ్లామర్ డోసు పెంచక తప్పడం లేదు. అది సినిమా కోసం కాకపోయినా.. భయట ప్రచార చిత్రాలు, ఫోటో షూట్స్ కోసం డోసు పెంచక తప్పలేదు. ఈ క్రమంలో ఓ నగల ప్రచారం కోసం చేసిన ఫోటో షూట్ లో మిల్కీ కాస్త శృతిమించింది. పై అందాలు, నడుము, తొడల అందాలు… ఇలా మూడింటిని ఫిట్ మూడులో చూపించేసింది.

ఇప్పటికీ తనలో ఏమాత్రం అందాలు తగ్గలేదని నిరూపించుకుంది. ఇప్పటికీ తాను గ్లామర్ హీరోయిన్ నే. ఆ పాత్ర కోసం వెయింటింగ్ అంటూ స్ట్రాంగ్ సంకేతాలు ఇచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. మిల్కీ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో నటిస్తోంది. ఇక మెగాస్టార్ బోళాశంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.