డిప్రెషన్ లో.. బాలీవుడ్ భామ

‘దంగ‌ల్‌’ సినిమాలో ఆమిర్ ఖాన్ కి రెండో కూతురిగా న‌టించిన స‌న్యా మ‌ల్హోత్రా, తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తన మనసులోని మాటలను బయట పెట్టెసింది. ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించాన‌ని, అయితే అత‌డితో నాలుగేళ్లు రిలేష‌న్ కొన‌సాగించాక బ్రేకప్ అయ్యిందని వివ‌రించింది. దీంతో తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపింది.

అయితే మ‌న‌ల్ని కాద‌నుకున్న వారి గురించి మ‌నం ఆలోచించ‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికింది. తాను ప్ర‌స్తుతం త‌న‌ ఆరోగ్యం, సినిమాల‌పై దృష్టి సారించాన‌ని వివ‌రించింది. కాగా, స‌న్యా న‌టించిన‌ మీనాక్షి సుందరేశ్వర్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ సినిమాకి అభిమానుల నుంచి మంచి ఆధరన లభిస్తుందని, దానికి చాలా సంతోషంగా ఉందని నటి స‌న్యా తెలిపింది.