ఆటోలు, ట్యాక్సీల్లో క్యూఆర్‌ కోడ్‌లు

ఆటోలు, ట్యాక్సీల్లో క్యూఆర్‌ కోడ్‌లు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ప్రయివేటు వాహన్నాలో వెళ్లే ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కోడ్‌ల ద్వారా ప్రయాణికులు తాము వెళ్తున్న వాహనం, దాని డ్రైవర్‌ వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు. ఈ క్యూఆర్‌ కోడ్‌లో డ్రైవర్‌, వాహనానికి సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి.

ఈ కోడ్‌ను ఉపయోగించి అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు ఫోన్‌ కూడా చేయొచ్చు. త్వరలోనే వీటిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆటోలు, ట్యాక్సీల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆటో యూనియన్లు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఈ కోడ్‌ల వల్ల అక్రమంగా ఆటోలు నడిపేవారి ఆటకట్టినట్లవుతుందని హర్షం వ్యక్తం చేశారు.