రాహుల్’ని బావ దెబ్బకొట్టాడు
కాంగ్రెస్ జాతీయ అధక్ష్యుడు రాహుల్ గాంధీని ఆయన బావ రాబర్ట్ వాద్రా దెబ్బ కొట్టారని చెప్పుకొంటున్నారు. కార్పోరేట్ దొంగలు విజయ్ మాల్యా, నీరవ్ పాండే.. విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని రాహుల్ గాంధీ గట్టిగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రాహుల్ వేసిన సటైర్స్ బీజేపీ నేతలని ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు రాహుల్ సోదరి ప్రియాంకా భర్త వాద్రాకు ఐటీ శాఖ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంపై రాహుల్ స్పందించకపోవడంపై బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
‘ఎగవేతదారుడు విజయ్‌మాల్యా, రాబర్ట్ వాద్రా యూపీఏ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి ఉదాహరణలు. వారికి చట్టం అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు వారు అభద్రతతో ఉన్నారు’ అని భాజపా ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు. కాగా, 2010-11 సంవత్సరాల్లో వాద్రాకు చెందిన స్కైలైట్ కంపెనీకి సంబంధించి రూ.25కోట్లు చెల్లించాల్సిన నేపథ్యంలో ఐటీ శాఖా ఈ నోటీసులు జారీ చేసింది.