మహిళల ఖాతాల్లోకి రూ.వెయ్యి కోట్లు బదిలీ
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నఉత్తరప్రదేశ్పై బీజేపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం కావడంతో.. దీనిపై బీజేపీ ఫుల్ ఫోకస్ చేసింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని బీజేపీనే పాలిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని చూస్తుంది. అఖిలేష్ నుంచి గట్టి పోటీ ఉండటంతో తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రజాకర్షణ కలిగిన నేతలతో ప్రచారం చేయిస్తుంది.
ఇక మోదీ యూపీపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది. 10 రోజుల వ్యవధిలో మోదీ యూపీలో నాలుగు సార్లు పర్యటించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెబుతున్నారు మోదీ. ఇక ఈ నేపథ్యంలోనే ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. మంగళవారం యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లను ప్రధాని మోదీ బదిలీ చేశారు. సుమారు 1.6 లక్షల మహిళా సంఘాల ఖాతాలకు వెయ్యి కోట్ల రూపాయలను బదిలీ చేయడాన్ని గర్వకారణంగా మోదీ పేర్కొన్నారు.