బాలీవుడ్ లో పుష్ప హవా.. నాల్గో రోజు రూ. 4.25కోట్లు !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ లోనూ సతా చాటుతున్నాడు. ‘పుష్ప’ హిందీ కలెక్షన్స్ సినీ పండితులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. బాలీవుడ్ లో తొలిరోజు పుష్ప రూ. 3.11కోట్లు కలెక్ట్ చేసింది. రెండోరోజు రూ. 3.55కోట్లు, మూడోరోజు ఏకంగా రూ. 5.18కోట్లు కలెక్ట్ చేసింది. ఇక నాల్గోరోజైన సోమవారం కలెక్షన్స్ పడిపోలేదు. రూ. 4.25 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు హిందీలో పుష్ప రూ. 16.09 కోట్లు వసూలు చేసింది. పాతికకోట్లపై కన్నేసింది. ఈ వారారంతంలోగా రూ. 25కోట్లు కలెక్ట్ చేసేలా కనిపిస్తున్నది.

బాలీవుడ్ క్రికెట్స్, ప్రేక్షకులు ‘పుష్ప’ అదిరిపోయిందని చెప్పుకుంటున్నారు. బన్నీ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సుకుమార్ టేకింగ్ కి అదిరింది అంటున్నారు. రస్మిక, సమంతల అందాలకు ఫిదా అవుతున్నారు. మొత్తంగా రోజురోజుకి బాలీవుడ్ లో పుష్పకు కలెక్షన్స్ పెరిగేలా కనిపిస్తున్నాయి. పుష్ప దెబ్బకు హాలీవుడ్ సినిమా స్పైడర్ మేన్ కలెక్షన్స్ కి భారీగా గండిపడింది.