చరణ్-శంకర్ సినిమా కంటెంట్ లీకు

రామ్ చరణ్ హీరోగా గ్రేట్ దర్శకుడు శంకర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఉద్యోగ వ్య‌వ‌స్థ తీరు తెన్నులు, ప్ర‌జ‌ల హ‌క్కుల గురించి ప్ర‌ధానంగా చ‌ర్చించే సినిమా ఇది. రామ్ చ‌ర‌ణ్ ఐఏఎస్ అధికారిగా క‌నిపించ‌బోతున్నాడు. ఇప్పుడీ.. ఈ సినిమాకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ కు సంబంధించిన కంటెంట్ లీకైనట్టు తెలుస్తున్నది.

శంక‌ర్ సినిమాలు టెక్నిక‌ల్ గా చాలా బాగుంటాయి. అదే సమయంలో ఎమోష‌న్ మిస్ కాదు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని గుండెలు బరువెక్కేలా తీర్చిదిద్దుతారు. ఆయన తొలి సినిమా జెంటిల్‌మెన్‌లో ఓ మంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది.భార‌తీయుడులోనూ గుండెలు బ‌రువెక్కించే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. జీన్స్‌లోనూ అంతే. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ తో చేస్తున్న సినిమాలోనూ ఓ బ‌ల‌మైన ఫ్లాష్ బ్యాక్ ఉంద‌ట‌.

అది చాలా భావోద్వేగ భ‌రితంగా ఉంటుంద‌ని, ప్రేక్ష‌కుల్ని ఎమోష‌న్‌కి గురి చేయ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ వ‌ల్లే… క‌థానాయ‌కుడి ల‌క్ష్యం పూర్తిగా మారుతుంద‌ని, క‌థ మ‌లుపు తిరుగుతుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. కొత్త షెడ్యూల్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే మొద‌లు కానుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో కైరా అద్వాణీ క‌థానాయిక‌. సునీల్‌, అంజ‌లి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత.