పవన్ నిజంగా ‘దేవుడు’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడి అవతారం ఎత్తబోతున్నారు. గతంలో ‘గోపాల గోపాల’ అనే సోషియో ఫాంటసీ సినిమాలో ఆయన దేవుడి క్యారెక్టర్ చేసారు. శ్రీకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చారు. వెంకీ, పవన్ కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

ఇప్పుడు మరోసారి పవన్ దేవుడి అవతారం ఎత్తబోతున్నారు. నటుడు సముద్రఖని డైరక్షన్ లో తయారయ్యే తమిళ రీమేక్ లో పవన్ ఓ స్పెషల్ రోల్ పోషించబోతున్నారు. ఆ రోల్ నే దేవుడి పాత్ర. ఈ సినిమాలో యంగ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ నటిస్తారని తెలుస్తోంది.

‘వినోధ్య సిథమ్’ అనే తమిళ సినిమా ఆధారంగా ఈ సినిమా తయారవుతుందని తెలుస్తున్నది. ప్రస్తుతం పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత దేవుడిగా మారనున్నారు.