రెండు బయోపిక్’లకు ధనుష్ గ్రీన్ సిగ్నల్

తమిళ నటుడు ధనుష్ వైవిధ్యమైన సినిమాలతో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు. ఆయన నటించిన బాలీవుడ్ చిత్రం #AtrangiRe ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ధ‌నుష్ త‌న డ్రీమ్ ప్రాజెక్టుల గురించి స్పందించాడు. అవి బ‌యోపిక్ లు కావ‌డం గ‌మ‌నార్హం. వాటిల్లో ఒకటి సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కాగా, రెండోది మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాది కావడం విశేషం.

ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్ ను ఇలా త‌న డ్రీమ్ ప్రాజెక్టుగా ధ‌నుష్ చెప్పాడు. మ‌రి ర‌జ‌నీ జీవితంలో కావాల్సిన స్పైసీ నెస్ ఉంది. బ‌స్ కండ‌క్ట‌ర్ స్థాయి నుంచి ర‌జ‌నీకాంత్ సినిమా హీరోగా మార‌డం అందులోని కీల‌క ఘ‌ట్టం కాగ‌ల‌దు. అలాగే కెరీర్ ప‌రంగా ఎత్తుప‌ల్లాలు, అంత‌ర్జాతీయ స్థాయి ఖ్యాతిని సొంతం చేసుకోవ‌డం వంటి అంశాలు కూడా ర‌జ‌నీ బ‌యోపిక్ లో హైలెట్స్ అవుతాయి. ఇళ‌య‌రాజా బ‌యోపిక్ రూపొందితే అందులో త‌ను ఆయ‌న పాత్ర‌ను చేస్తానంటున్నాడు ధ‌నుష్. సంగీతం మీద మంచి అభిరుచి ఉన్న నటుడు ధనుష్. మంచి సింగర్ కూడా. అందుకే ఇళయరాజాగా మారాలని ఆశపడుతున్నాడు.