పుష్ప ఫన్ ప్రోమో చూశారా.. ?

సుకుమార్-అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమా తెరకెక్కిన పుష్ప పార్ట్-1 ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. బాలీవుడ్ విడుదలైన అన్నీ చోట్ల బంపర్ కలెక్షన్స్ రాబడుతోంది. బిగ్గెస్ గ్రాసర్ గా నిలిచింది. కేవలం నాలుగురోజుల్లో రూ. 200కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ ఆనందంలో ఉన్న చిత్రబృందం తిరుపతిలో విజయోత్సవసభ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. 


మరోవైపు ప్రమోషన్స్ మాత్రం ఆపడం లేదు. తాజాగా పుష్ప ఫన్ ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక మందనకు బన్నీ సైట్ కొడుతుండటం చూడొచ్చు. పక్కనే ఫ్రెండ్ ను చూసిందారా ? అని అడిగితే.. ఒక్కసారి కూడా జూడలేదు అమ్మీ అని చెప్పడం.. దానికి పుష్పరాజ్ భలే హ్యాపీగా ఉంటది కదా రా నీకు. నాకెందుకు ఉంటది మచ్చా అని ఫ్రెండ్ అనగా.. లేదురా.. నీకు మస్త్ సమ్మగా  ఉంటది. ఏరా.. చూసిందని చెబితే.. నీ సొమ్ము ఏమైనా ఉంటదా ? అని బన్నీ చెప్పడం నవ్వులు పూయిస్తుంది. ఈ సీన్ లో అసలు బన్నీ కనిపించలేదు. ఆయన చేసిన పాత్ర మాత్రమే కనిపించింది. అంతలా లీనమైపోయారు. ఈ ఫన్ ప్రోమోను మీరు ఓసారి చూసేయండీ.. !