బీజేపీతో ప‌వ‌న్ భారీ డీల్.. నిజ‌మా..!?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఓ షాకింగ్ ఆరోపణ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు పవన్ బీజేపీతో ఢీల్ కుదుర్చుకున్నారన్నది ఆ ఆరోపణ సారాంశం. ఇందుకోసం బీజేపీ అధిష్టానంతో పవన్ 1500కోట్ల రూపాయ‌ల డీల్ కుదుర్చుకొన్నాడట. ఇప్పటికే ఇటీవల పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించిన సందర్భంగా 700కోట్లు ముట్టాయని, మిగిలిన మొత్తాన్ని ఎన్నికలకు ముందు ముట్టజెబుతారంటూ సోష‌ల్ మీడియా ఓరేంజ్ లో కోడై కూస్తోంది.

2014 సాధారణ ఎన్నికల్లో పవన్ బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు తెలిపిన విష‌యం తెలిసిందే. ఆ సమయంలో కూడా బీజేపీ-టీడీపీ పవన్ తో 500కోట్ల రూపాయ‌ల డీల్ జరిగినట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని జనసేన కార్యకర్తలు ఖండించార‌నుకోండి. ఆ విష‌యం ప‌క్క‌న పెడితే మ‌ళ్లీ ఇప్పుడు 2019 సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మరోసారి పవన్ బీజేపీతో ఢీల్ ఓకే అయిందనే కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే ఇది వాస్త‌వ‌మో, లేక విప‌క్షాలు చేస్తున్న ప్రచార‌మో తెలియ‌దు కానీ ప‌వ‌న్ కు మాత్రం ఈ ప్ర‌చారం న‌ష్టం చేకూరుస్తుంద‌న్న‌ది మాత్రం నిజం. ఇక ఇలాంటి ప్ర‌చారాన్ని తిప్పికొట్టి , రాజ‌కీయంగా జ‌న‌సేన ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతుందో చూడాలి..