రాధేశ్యామ్.. టెన్షన్ ?
ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ” రాధేశ్యామ్”. ఈ చిత్రాన్ని జనవరి 14న ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా 20 రోజులు టైమ్ ఉండడంతో రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తునారు సినీ వర్గాలు. ఈ చిత్రం రిలీస్ అయ్యేలోపు కరోనా (ఒమిక్రాన్) ప్రభావం దాని మీద పడుతుందేలమోనని చిత్ర యూనిట్ ఆందొళన పడుతుంది.
ఇప్పటికే విపరీతంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో డిల్లీతో పాటు మరికొన్ని చోట్ల న్యూఇయర్ సెలబ్రేషన్స్ తో పాటు మాస్ గేదరింగ్స్ అన్నిటినీ బ్యాన్ చేశారు. వీటితో ఆగకుండా ముందు ముందు సినిమాలు, థియేటర్ల విషయంలో కూడా నిబంధనలు మొదలైతే.. రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల పరిస్థితి ఏంటా అని టెన్షన్ స్టార్ట్ అయ్యింది సినిమా ఇండస్ట్రీలో. ఇప్పటికే అలర్ట్ లో ఉన్న గవర్నమెంట్స్ మరోసారి ధియేటర్లకు ఆంక్షలు విధిస్తే.. సినిమా పరిస్థితి ఏంటని వాపోతునారని సినీ వర్గాల సమాచారం.