కోలివుడ్ లో విషాదం.. కమల్ దర్శకుడు మృతి !

సినీ చిత్ర పరిశ్రమ ఒకరి తరువాత ఒకరిని కోల్పోతుంది. తాజాగా ప్రముఖ . తమిళ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్(90) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం చెన్నైలో మరణించారు. సేతు మాధవన్ 1931లో కేరళలో పాలక్కడ్ లో జన్మించారు. ఆయనకు భార్య వల్సాల, పిల్లలు సోను కుమార్, ఉమ, సంతోష్ సేతు మాధవన్ ఉన్నారు. . సేతు మాధవన్ 1961లో  మలయాళీ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. 60 కి పైగా చిత్రాలకు  దర్శకత్వం వహించగా, తెలుగులో సేతు మాధవన్ 1995లో స్త్రీ చిత్రానికి దర్శకత్వం వహించారు.

తెలుగులో ఆయన తెరకెక్కించిన స్త్రీ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిలిం గా జాతీయ అవార్డు అందుకుంది.  సేతుమాధవన్ పనిచేసిన దాదాపు 10 చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కాయి. 1990లో ఆయన తెరకెక్కించిన మరుపక్కం అనే చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో కూడా ఆ చిత్రానికి అవార్డు దక్కించింది.  ఇక కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు.

లోకనాయకుడు కమల్ హాసన్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం చేసింది ఈ దర్శకుడే. తనని వెండితెరకు పరిచయం చేసిన సేతు మాధవన్ మృతికి కమల్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.   సేతుమాధవన్  కన్నడ, హిందీ భాషల్లో కూడా చిత్రాలు తెరకెక్కించారు