కోర్టుకెక్కనున్న రేషన్ డీలర్లు..!
రేషన్ డీలర్లపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహిస్తోందని రేషన్ డీలర్ల సంఘం ఆరోపిస్తోంది. ప్రభుత్వం దిగిరాకుంటే నిరాహార దీక్షకు కూడా వెనుకాడమని రేషన్ డీలర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే డీలర్లు ప్రభుత్వం నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీలర్లకు నోటీసులు పంపడం చట్ట వ్యతిరేకమంటూ, ప్రభుత్వ నోటీసులపై కోర్టుకు వెళ్తామని డీలర్ల సంఘం హెచ్చరిస్తోంది. కోర్టకు వెళితే తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం రేషన్ షాపులను టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందని వారు అనుమానం వ్యక్తం చేశారు. అందుకే రేషన్ డీలర్లను అణచివేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. తమకు రావాల్సిన 600కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ప్రాణత్యాగం చేసైనా తమ డిమాండ్లు సాధించుకుంటామని రేషన్ డీలర్లు హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే తమ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.