5 రోజుల్లో 12వేల విమానాలు రద్దు
కరోనా నేపథ్యంలో విమానయానరంగం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మరో గండం ఎదురైంది. ఈ కరోనా కొత్త వేరియంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో అనేక దేశాలు విమానప్రయాణాలపై ఆంక్షలు, నిషేధం విధిస్తున్నాయి.
గత శుక్రవారం నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 12వేల విమానాలు రద్దయినట్లు ‘ఫ్లైయిట్‌అవేర్’ అనే సంస్థ తెలిపింది. సోమవారం ఒక్క రోజే 3 వేల విమానాలు రద్దు కాగా.. మంగళవారం వెయ్యికిపైగా విమాన ప్రయాణాలు రద్దయినట్లు తెలిపింది. డిసెంబర్ చివరివారంలో విమానాలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతుండేవి. కానీ.. ఒమిక్రాన్ భయంతో ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు.