బాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ క్రేజ్‌ పెరగడానికి కారణలివే.. !

సుకుమార్‌ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం.. డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. బాలీవుడ్‌లో ఈ చిత్రంతో.. బన్నీకి మరింత క్రేజ్‌ పెరిగింది. బన్నీకి బాలీవుడ్‌లో ఆ స్టార్‌డమ్‌ రావడానికి గల కారణాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ వివరించారు.

ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు సినిమాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో ఆయా నటులకు కూడా ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కి బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. దాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే, హిందీలో విడుదలైన ‘పుష్ప’కి కూడా భారీ ఓపెనింగ్‌ కలెక్షన్లు వచ్చాయి. హిందీ సినిమాలు కూడా అంత కలెక్షన్స్‌ రాబట్టలేకపోయాయి”అని కరణ్‌ జోహార్‌ తెలిపారు.