వాలిమై ట్రైలర్ విడుదల.. సినిమా వాయిదా !

కోలీవుడ్‌ స్టార్ అజిత్‌ తాజా చిత్రం ‘వాలిమై’. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టిన చిత్రబృందం తాజాగా ట్రైలర్  ని విడుదల చేసింది. యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ అదిరిపోయింది. ముఖ్యంగా బైక్ రైడ్ సీన్స్ అబ్బరపరుస్తాయి. విలన్ పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ పవర్ ఫుల్ గా కనిపించారు.

సంక్రాంతి కానుకగా వాలిమై ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ట్రైలర్ మాత్రం రిలీజ్ డేటును ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో వాలిమై విడుదలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. థియేటర్స్ మూతపడటం, 50 శాతం ఆక్యుపెన్సీకే పరిమితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాలిమై రిలీజ్ డేటు విషయంలో చిత్రబృందం ఆలోచనలో పడినట్టు తెలుస్తున్నది.