సామ్.. రెడ్ హాట్ !

స్టార్ హీరోయిన్ సమంత ఏడాది చివరిలో రెచ్చిపోతుంది. ‘పుష్ప’ ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావా ? ఊ ఊ అంటావా మావా ?’ లో అందాల విందు చేసింది. సినిమాలో పాట మాత్రమే కాదు. ఈ పాటకు సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో దున్నేశాయి. ఆ తర్వాత కూడా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా బికినీ పిక్స్ తో రచ్చ చేసింది. స్నేహితులతో కలిసి మాల్దీవులకు వెళ్లిన సామ్.. అక్కడ బికినీ ట్రీట్ ఇచ్చింది. సమంత ఎప్పుడూ అలా చూడని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా రెడ్ డ్రెస్ లో హాట్  హాట్ పోజులు ఇచ్చింది. దానికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయాకొస్తే.. ప్రస్తుతం సామ్ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. ఆమె నటించిన శాకుంతలం రిలీజ్ కి రెడీగా ఉంది. ఓ ఇంటర్నేషనల్ సినిమాతో పాటు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలని ఈ బ్యూటీ లైన్ లో పెట్టేసింది. అయితే బాలీవుడ్ బాగా రాణించాలనే కసితో సామ్ ఉన్నట్టు తెలుస్తున్నది.