మోడీకి నో చెప్పిన పవార్

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాలను బట్టీ శత్రువులు మిత్రులుగా మారుతుంటారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు దగ్గర పార్టీ అయిన ఎన్సీపీని బీజేపీ దగ్గర చేసుకొనే ప్రయత్నం చేసింది. తాజాగా ఈ విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ బయటపెట్టారు.

“అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధానితో నేను సమావేశమైన మాట నిజమే. ఎన్సీపీ, భాజపా చేతులు కలపాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. కానీ నేను పీఎం కార్యాలయానికి వెళ్లి.. అది సాధ్యం కాదని చెప్పివచ్చా. మా సిద్ధాంతాలు వేరని చెప్పా. అయితే దాని గురించి మరోసారి ఆలోచించాలని మోదీ అన్నారు” అని పవార్‌ నాటి సంఘటనలను తెలిపారు.