సునామీలా ఒమిక్రాన్ కేసులు.. సంక్రాంతి తర్వాత థర్డ్ వేవ్ !

కరోనా డెల్టా వేరియంట్ కంటే అత్యంత డేంజర్ గా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కనిపిస్తున్నది. డెల్టా వ్యాప్తి కొనసాగుతోన్న సమయంలోనే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తూ.. కేసుల సునామీని సృష్టిస్తోంది. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలోనూ గత రెండు మూడు రోజులుగా ఒమిక్రాన్ కేసులు ఎక్కువయ్యాయి.

 ప్రస్తుతం కేసుల పెరుగుదల థర్డ్‌వేవ్‌కు సంకేతమన్నారు. డెల్టా వేరియంట్‌ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉందని తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు తెలిపారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని డీహెచ్‌ అన్నారు. లక్షణాలు కనిపించినవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశముందని డీహెచ్ తెలిపారు.