గుడ్ న్యూస్ : పిల్లలపై ‘కొవాగ్జిన్‌’ ఉత్తమ ఫలితాలు

2-18 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన ‘కొవాగ్జిన్‌ (COVAXIN)’ టీకా ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలను కనబరిచిందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. పెద్దవారితోపాటు చిన్నారులకు కూడా సురక్షిత, సమర్థమైన టీకాను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని సాధించామని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ ఎల్లా తెలిపారు.

కొవాగ్జిన్‌ తీసుకున్న చిన్నారుల్లో 1.7 రెట్లు యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు తెలిపింది. ముఖ్యంగా తీవ్ర దుష్పరిణామాలేవీ చూపలేదని స్పష్టం చేసింది. పిల్లలకు ఈ టీకా సురక్షితమని తేలడమే కాకుండా తట్టుకోగల శక్తి, రోగనిరోధక పెరుగుతున్న విషయం ప్రయోగాల్లో రుజువైందని తెలిపింది.