సుధీర్ బాబు సూపర్ స్టార్ అవుతాడట

యంగ్ హీరో సుధీర్ బాబు సూపర్ స్టార్ సుధీర్ బాబు అవుతాడట. మహానటుడు ‘ఎన్టీఆర్’ బయోపిక్ కోసం సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్ బాబుని నటింపజేయాలని దర్శకుడు క్రిష్ ప్రయత్నించాడు. ఇప్పటికే మహేష్ బాబుని కలిసి చర్చించాడు కూడా. ఐతే, తండ్రి పాత్రలో నటించేందుకు మహేష్ అంగీకరించలేదు. క్రిష్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. దీంతో సూపర్ స్టార్ పాత్ర కోసం సుధీర్ బాబుని తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నాడట. త్వరలోనే సుధీర్ బాబుకు మేకప్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు సూపర్ స్టార్ అవుతాడని ఇండస్ట్రీలో చెప్పుకొంటున్నారు.

మరోవైపు, ఎన్టీఆర్ బయోపిక్’లో ఏఎన్నార్ పాత్ర కోసం కూడా పెద్ద కసరత్తు జరుగుతోంది. ఈ పాత్ర కోసం ముందుగా నాగ చైతన్యని అనుకొన్నారు. ‘మహానటి’లో చైతూ ఏఎన్నార్ పాత్రలో కనిపించి ఆకట్టుకొన్నారు. మరోసారి చైతూ తాత పాత్రలో కనిపించేందుకు రెడీగా ఉన్నాడు. ఐతే, దర్శకుడు క్రిష్ మాత్రం చైతూ కాకుండా సుమంత్ ని ఏఎన్నార్ గా చూపిస్తే ఎలాగుంటుంది ? అని ఆలోచిస్తున్నారు. ఈ ప్రపోజల్ ని బాలయ్య ముందు ఉంచారు. త్వరలోనే సుమంత్ కు మేకప్ టెస్ట్ నిర్వహించి ఓ నిర్ణయం తీసుకొన్నారు. సుధీర్ బాబు, సుమంత్ లకు ఎన్టీఆర్ బయోపిక్ లో అవకాశం దక్కే అవకాశాలు మాత్రం అనిపిస్తున్నాయి.

మహానటుడి బయోపిక్ సెట్స్ మీదకు వెళ్లకముందే వివాదాలు మొదలయ్యాయి. సినిమాలో నాదెండ్ల భాస్కర్ రావు పాత్రపై అభ్యంతరం తెలుపుతూ నాదేండ్ల ఫ్యామిలీ క్రిష్, బాలయ్యలకు నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాలు అన్నీ దాటుకొని ఎన్ టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక, ఎన్ టీఆర్ గా బాలయ్య, ఆయన భార్య బసరవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, నాదేండ్ల బాస్కర్ రావుగా బాలీవుడ్ నటుడు సచిన్ కేడ్కర్, చంద్రబాబు పాత్రలో రానా దగ్గుపాటి కనిపించనున్నారు. ఇక, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ పాత్రల్లో ఎవరు కనిపించబోతున్నారు అన్నది ఇంకా ఫైనల్ కాలేదు.