తొలి టెస్టు టెస్ట్ మనదే.. కానీ !

తొలి టెస్టులో కోహ్లీ సేన శుభారంభం చేసింది. సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో సఫారీలను 113 పరుగుల తేడాతో ఓడించింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి 94/4తో ఉన్న ప్రొటీస్‌ జట్టు మరో 97 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, మహమ్మద్‌ షమి తలో మూడు… మహమ్మద్‌ సిరాజ్‌, అశ్విన్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

అయితే టీమిండియాలో సీనియర్లు ఫామ్ లో లేకపోవడం లోటుగా కనిపిస్తున్నది. రహానె,పూజారా భారీ స్కోర్లు చేయక చాన్నాళ్లయింది. కెప్టెన్ కోహ్లీ నుంచి టెస్ట్ సెంచరీ చూడాక చాలా రోజులు అవుతుంది.  మరోవైపు శ్రేయస్‌ అయ్యర్, హనుమ విహారి, సాహా వంటి వారు అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం జట్టు మేనేజ్‌మెంట్ పుజారా, రహానెలో ఒకరిపై వేటు వేసి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వొచ్చని చెబుతున్నారు.