4 నెలల పాటు థర్డ్‌వేవ్
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగుతున్న క్రమంలో డేంజర్ న్యూస్ అందుతోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైపోయింది. అది మరో నాలుగు నెలల పాటు కొనసాగనుందని ఐఐటీ కాన్పుర్కు చెందిన ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ అభిప్రాయపడ్డారు. దేశంలో రోజుకు 1.8 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అయితే ఆసుపత్రుల బారిన పడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ ర్యాలీలు సూపర్ స్ప్రెడర్లుగా మారతాయని హెచ్చరించారు.
‘ఎన్నికల ర్యాలీల్లో భారీఎత్తున ప్రజలు పాల్గొంటారు. కొవిడ్ నిబంధనలను పాటించరు. దీనివల్ల దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో థర్డ్ వేవ్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. అయితే ఈసారి కరోనా సోకిన ప్రతి 10 మందిలో ఒక్కరికి మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుంది. మార్చి చివరి నాటికి దేశంలో రెండు లక్షల పడకలు అవసరమవుతాయి’ అని మహీంద్ర అగర్వాల్ అంచనా వేశారు.