మరోసారి మిడిల్ ఆర్డర్ డమాల్

టీమిండియా మిడిల్ ఆర్డర్ సమస్య తీరడం లేదు. సీనియర్లు పూజారా, రహానే వైఫల్యం కొనసాగుతూనే ఉంది. సోమవారం సౌతాఫ్రికాతో మొదలైన సెకండ్ టెస్టులో టీమిండియా ఓపెనర్లు కె ఎల్ రాహుల్ (50), మయాంక్ అగర్వాల్ (26) శుభారంభాన్నే ఇచ్చారు.

అయితే ఆ తర్వాత వచ్చిన పుజారా (3), రహానె (0) ఘోరంగా విఫలం కావడంతో.. కష్టాలు తప్పలేదు. ఆ తర్వాత వచ్చిన హనుమ విహారి (20), పంత్ (17) తక్కువ స్కోరుకి పరిమితం అయ్యారు. దీంతో.. 54 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అశ్విన్ (26), శార్థూల్ (0) ఉన్నారు.