సిరాజ్‌ కు గాయం.. ఆడటం కష్టమే !

వాండరర్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా పేసర్ సిరాజ్‌ మోకాలి కండరాల నొప్పితో విలవిల్లాడిన సంగతి తెలిసిందే. 17వ ఓవర్‌ ఐదో బంతి వేసిన సిరాజ్‌… అసౌకర్యానికి గురయ్యాడు. ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. నొప్పి తీవ్రం కావడంతో సిరాజ్‌ మైదానాన్ని వీడాడు. ఈ విషయం గురించి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అశ్విన్‌ స్పందించారు. 

సిరాజ్‌ పట్టుదల, సంకల్పం గొప్పది. అతడు తప్పక తిరిగి రావడమే కాదు.. తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తాడని అశ్విన్‌ అన్నారు. పేసర్లకు దక్షిణాఫ్రికా పిచ్‌లు బాగా అనుకూలిస్తాయి. ఈ నేపథ్యంలో రెండోరోజు సిరాజ్ ఆడటం చాలా కీలకం. నిన్న దక్షిణాఫ్రికా కోల్పోయిన ఒక వికెట్ ను కూడా సిరాజ్ నే తీశారు. ఇక రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 202 వద్ద అలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా ఒక వికెట్‌ నష్టానికి 35 పరుగులు చేసింది.