విజయ్-నయన్.. ముద్దొస్తున్నారు !

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఏ పాత్ర చేసిన అందులో జీవించేస్తాడు. హీరోయిన్ నయనతార అంతే. వీరిద్దరు కలిసి నటిస్తున్న తమిళ చిత్రం ‘కత్తువాకుల రెండు కాదల్’ (Kaathuvaakula Rendu Kaadhal). నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత మరో హీరోయిన్. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ రొమాంటికి కామెండీ ఎంటర్ టైనర్ ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించుకోని.. ఈ సినిమా ప్రమోషన్స్ షురు అయ్యాయి. సినిమాలోని మొదటి సాంగ్ #NaanPizhai ని సోమవారం రిలీజ్ చేశారు. . సాంగ్ చాలా కూల్ గా హాట్ టచ్చింగ్ గా ఉంది. ఇందులో విజయ్-నయన్ ముద్దొస్తున్నారు. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. 24 గంటలు తిరక్కముందే 1మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని దూసుకెళ్తుంది. ప్రేమకథలను విజయ్ ప్రాణం పెట్టి చేస్తాడు. విజయ్-త్రిష జంటగా నటించిన ’96’లోలో ఆయన ఫర్ ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు..  ‘కత్తువాకుల రెండు కాదల్’ లోనూ ఆ మేజిక్ రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నది.