సీఎంపై ప్రధాని ఆగ్రహం
పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ నేడు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కార్యక్రమ వేదికకు వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
అయితే మోడీ ప్రయాణిస్తోన్న కాన్వాయ్ మార్గంలో ఓ ఫ్లైఓవర్ వద్ద ఆందోళనకారులు రహదారిని బ్లాక్ చేశారు. దీంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకుని తిరిగి భఠిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు.
అక్కడ మోదీ అధికారులతో మాట్లాడుతూ.. ”మీ సీఎంకు(పంజాబ్ ముఖ్యమంత్రి) కృతజ్ఞతలు. కనీసం నేను భఠిండా ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా” అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. పంజాబ్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే భద్రతాలోపం తలెత్తిందని ఆరోపించింది.