సార్ షూటింగ్ షురు

తమిళ్ స్టార్ ధనుష్ స్ట్రయిట్ తెలుగు సినిమా ‘సార్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సంయుక్తా మీనన్ హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోమవారం నుంచి ‘సార్’ క్లాస్ షురు అయింది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజాగా సార్ రెగ్యూలర్ షూటింగ్ మొదలైపోయింది. సెట్స్ నుంచి ఓ ఫోటోను అభిమానుల కోసం షేర్ చేసింది చిత్రబృందం. ఇందులో ధనుష్ 10+2 చదువుతున్న డ్రెస్ లో కనిపిస్తున్నాడు. దూరంగా ఏదో గొడవ జరుగుతుంతే.. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు.

నేరుగా తెలుగులో ఓ సినిమా చేయాలని తమిళ స్టార్ ధనుష్ ఎప్పటి నుంచో ఆశపడుతున్నాడు. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు కూడా. అయితే సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ సినిమా క్యాన్సిల్ అయిందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శేఖర్ కంటే ముందు వెంకీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడమే ఇందుకు కారణం. ఇక సార్ సినిమా తెలుగు, తమిళ్ (వాతి), హిందీ బాషాల్లో ఈ సినిమా ఒకేసారి తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీ.వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.  


 

. @dhanushkraja in & as #Vaathi /#SIR ~ Filming Begins 🎥 ⚡️#SIRMovie @iamsamyuktha_ #VenkyAtluri @gvprakash @dineshkrishnanb @NavinNooli @vamsi84 #SaiSoujanya @Fortune4Cinemas @SitharaEnts pic.twitter.com/lhkh6fdCyi— OTTRelease (@ott_release) January 7, 2022