ఒమిక్రాన్.. కొవిడ్‌కు సహజసిద్ధ టీకా కాదు
ఒమిక్రాన్.. కొవిడ్‌కు సహజసిద్ధ టీకా కాదు. దాన్ని అలా పరిగణించడం ప్రమాదకరం. ఎందుకంటే.. మన ఆరోగ్యంపై భిన్న వేరియంట్లు చూపే ప్రభావంపై మనకు పూర్తి అవగాహన లేదన్నారు భారత సంతతి లండన్ శాస్త్రవేత్త రవీంద్ర గుప్తా.
కరోనాలోని ఒమిక్రాన్ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉండొచ్చన్న వార్తలు రావడం ప్రస్తుతానికి ఊరటనిచ్చే అంశమే. కానీ తదుపరి వేరియంట్ మరింత ప్రమాదకరంగా మారొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వల్ల స్వల్ప స్థాయి ఇన్ఫెక్షన్ మాత్రమే కలుగుతున్నందువల్ల ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టీకాల విస్తృతిని పెంచాలని ఆయన సూచించారు.